నిన్న ఉదయం కన్నుమూసిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య తన చివరి క్షణాల్లో సంచలనాత్మక రీతిలో మరణ వాంగ్మూలం ఇచ్చారా? తనను ‘ఎర్రజెండా బిడ్డ’గానే సాగనంపాలని ప్రజలను, పార్టీ కార్యకర్తలను కోరారా? ఇదే అంశంపై సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆడియోతోపాటు వాట్సాప్ పోస్టులు సంచలనం కలిగిస్తున్నాయి. అయితే ఈ ఆడియోలు నకిలీగా నోముల నర్సింహ్మయ్య కుటుంబ సభ్యులు పేర్కొంటూ, ఖండిస్తున్నారు. దురుద్ధేశంతో కొంతమంది రాజకీయ ప్రత్యర్ధులు ఫేక్ ఆడియా సృష్టించారని ఎమ్మెల్యే నర్సింహయ్య బావమరిది సాదం సంపత్ కుమార్, కుటుంబ సభ్యులు అంటున్నారు. కానీ దివంగత ఎమ్మెల్యే ‘నోముల’ తన ఆఖరి ఘడియల్లో చెప్పారని ప్రచారంలోగల ఆయా ఆడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందుకు సంబంధించిన వాట్సాప్ పోస్ట్ ను, ఆడియోలను దిగువన చదవొచ్చు, వినవచ్చు.
నన్ను ఎర్రజెండ బిడ్డగానే సాగనంపండి…….!
నోముల నర్సింహయ్య మరణ వాగ్మూలం !
వ్యక్తుల మీద కోపంతోనో
ఆర్దిక ఇబ్బందుల ఒత్తిడితోనో
పార్టీ నిర్మాణపు వొడుదొడుకుల సమస్యలతోనో… అమ్మ లాంటి అరుణ పతాకాన్ని వీడి సాధించేదేమీ లేదు.
వ్యక్తిత్వాలను చంపుకొని
ఆత్మ గౌరవాన్ని వదులుకొని
పవిత్ర విప్లవ కర్తవ్యానికి దూరం కాకండి.
బూర్జువా పార్టీలను వీడి ఎర్రజెండాలతో కొనసాగండి.