గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానం నుంచి పోటీచేసిన టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గొంతుగా భావిస్తున్న ఆడియో ఒకటి పెను సంచలనం కలిగిస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఆడియోలోని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసేవిధంగా గోచరిస్తుండడం గమనార్హం. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో గల కొందరు స్వతంత్ర అభ్యర్థులకు చెందిన పోలింగ్ ఏజెంట్లు తమ వాళ్లేనని, ఎవరైనా అభ్యంతరం చెబితే ఏం చేయాలనే అంశంపై మాట్లాడిన మాటలు తీవ్ర కలకలానికి దారి తీస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో డబ్బు సంచులను గుమ్మరించారని, ఓట్లను కొనుగోలు చేశారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే ఈ ఆడియో వెలుగు చూడడం గమనార్హం. మొత్తం 1.03 నిమిషాల నిడివిగల ఈ ఆడియోలో అక్కడక్కడా అసంపూర్తి వ్యాఖ్యలు వినిపిస్తుండడడం గమనార్హం. ఇక లీకైన ఆయా ఆడియోను దిగువన వినండి.