Facebook Twitter YouTube
    Monday, May 29
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»National News»‘కొడవలి’ నాని… కోసేశాడు తెలుసా?

    ‘కొడవలి’ నాని… కోసేశాడు తెలుసా?

    November 16, 20192 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 kodali nani

    మొన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తిట్ల దండకం గుర్తుంది కదా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పవన్ నాయుడుగా అభివర్ణించిన ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఉదంతమూ తెలిసిందే కదా? ఇదిగో ఇప్పడు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వంతు వచ్చినట్లుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అంటావా? ఆయ్… అంటూ ఓవైపు పవన్ కళ్యాణ్ ను, మరోవైపు మాజీ సీఎం చంద్రబాబునాయుడిని తనదైన భాషా శైలిలో ఉతికి ఆరేశారు. కష్ణా జిల్లా రాజకీయాల్లో వల్లభనేని వంశీ, కొడాలి నాని మంచి స్నేహితులు. పార్టీలు వేరైనా వారిద్దరిది విడదీయరాని స్నేహం. మచిలీపట్నం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పేర్ని నానికి కూడా ప్రస్తుతం కొడాలి నానితో స్నేహం చిక్కబడిందట. పేర్ని నాని కాంగ్రెస్ లో ఉన్నపుడు కూడా కొడాలి నానితో స్నేహం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇద్దరూ మంత్రులే కావడంతో ఈ స్నేహం మరింత బలపడిందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇదిగో ఈ ముగ్గురు స్నేహితులు ఒకరి తర్వాత ఒకరు వంతుల వారీగా అటు చంద్రబాబుపై, ఇటు పవన్ కళ్యాణ్ మీద తిట్ల దండకాన్ని తీవ్రతరం చేశారు. పవన్ కళ్యాణ్ వాడిన ‘జగన్ రెడ్డి’ పదంపై స్పందిస్తూ, కొడాలి నాని గుడివాడలో తాజాగా స్పందించిన తీరు రాజకీయాంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకీ కొడాలి నాని  ఏం మాట్లాడారో క్లుప్తంగా ఆయన మాటల్లోనే చదవండి మరి…

    ‘జగన్ మోహన్ రెడ్డి గారు హిందువా? క్రిస్టియనా? ముస్లిమా? ఇవన్నీ మీకెందుకు? ఆయన్ని ప్రజలేమైనా అడిగారా? తిరుపతిలో సంతకం పెట్టావా?…అంటున్నారు… నీ యమ్మా మొగుడు కట్టిచ్చాడా… తిరుపతిలో గుడి? ఈ రాష్ట్రంలో పుట్టిన పౌరుడిగా జగన్ మోహన్ రెడ్డికి ఏ గుడిలోకైనా, చర్చిలోకైనా, మసీదులోకైనా వెళ్లే హక్కు, అధికారం ఉన్నాయ్. ఎవడికి సంతకం పెట్టాలి? ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి? పిచ్చవాగుడు. సన్నాసి మాటలు. మధ్యలో ‘మోహన్’ తీసేస్తావేంటి? జగన్ కన్నా షార్టా… జగన్ రెడ్డి? చంద్రబాబునాయుడు అంటాడు… ఆంబోతుల్లాగా మేం పవన్ కళ్యాణ్ మీదకు లెగుత్తున్నామంట. నువ్వేంటి? కుక్క లాగా మొరుగుతున్నావా? నక్కజిత్తుల…నక్కలాగా దొంగ నాటకలాడుతున్నవా? నీ బాబు నుంచి ఒచ్చిన నక్క రక్తమా నీది? మామను వెన్నుపోటు పొడిచావ్… పార్టీని దొంగిలించావ్… ఎన్టీరామారావు చావుకి కారణమయ్యావ్…. నువ్వు చార్జ్ షీట్ వేస్తవా… ఇసుకదొంగలమని? నీకు మల్లే ఇసుకో, మడ్డో..చెత్తో, చెదారమో తినాల్సిన ఖర్మ మాకు లేదు..వైసీపీ నాయకులకు. చంద్రబాబునాయుడూ… ఒళ్లు దగ్గర పెట్టుకో, నీకు డెబ్బయ్ సంవత్సరాల వయసొచ్చింది. సిగ్గూ, శెరం లేదు. నిన్ను ఎన్ని తిట్టినా కూడా…జనం ఛీత్కరించినా కూడా. అయినా కూడా మళ్లీ వస్తవ్. లేస్తే మనిషిని కాదని… చంద్రబాబునాయుడు దొంగ, ఎదవ, సన్నాసి అని దేవినేని అవినాష్ కి చెప్పా… తండ్రిలేని పిల్లల్ని అన్యాయం చేస్తడని. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవని సీట్లో గుడివాడకు తీసుకొచ్చి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాడు. చిన్న పిల్లాడిని బలిపశువును చేశాడు. ఆ పార్టీ తెలంగాణాలో ఎట్టా మట్టి గొట్టుకుపోయిదో, ఇక్కడ కూడా మట్టిగొట్టుకుపోద్ది. బీజేపీ, జనసేన నీకు ఎనక నుంచి బొక్కబెట్టి… నీ రసం పిండేయాలని ప్రయత్నం చేస్తున్నయ్. రాజకీయంగా నీకు ఆఖరు రోజులు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని నక్క, వెన్నుపోటు… నీకున్నటువంటి పేటెంట్లు మార్చి ఇప్పటికైనా ప్రజల కోసం పనిచెయ్. ఏవైనా మంచి సలహాలివ్వు ప్రభుత్వానికి… స్వీకరిస్తాం. నీ పిచ్చ పిచ్చ నాటకాలు, యాక్షనూ, డాన్సులూ, నీ డ్రామాలు ఇయన్నీ చేశావనుకో…నిన్ను ఆల్రెడీ బొందబెట్టారు. ఒళ్లు దగ్గర పెట్టుకో..నువ్వో ఫోర్ టొంటీ గాడివి.’’ అంటూ మంత్రి కొడాలి నాని హితవు పలికారు.

    Previous Articleజోస్యం అంటే అయనదే… ఇంతకీ ఎవరతను?
    Next Article జగన్ పై పవన్ కార్టూన్ కథేమిటి?

    Related Posts

    దొడ్డ మనసులో వద్ది‘రాజు’

    May 12, 2023

    ఖమ్మంలో బీజేపీ నేతల అరెస్ట్

    May 5, 2023

    పొంగులేటి ఇంట్లో పొలిటికల్ స్కెచ్ ఏంటి?

    May 4, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.