ఔను.. మేడారం జాతరకు ఆంధ్రప్రదేశ్ నుంచి దొంగలు బయలుదేరారు. పథకం ప్రకారం జాతరలో భక్తులను దోపిడీ చేసేందుకు స్కెచ్ వేసుకుని మరీ బయలుదేరిన దొంగలను ఖమ్మం పోలీసులు ఆదిలోనే కట్టడి చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఖమ్మం నగర ఏసీపీ హరికృష్ణ వివరించారు. ఈ దొంగలకు సంబంధించిన చిత్రాలను కూడా విడుదల చేసిన ఖమ్మం పోలీసు శాఖ మేడారం భక్తులను అప్రమత్తం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రద్దీగా ఉండే బస్‌స్టాండుల్లో మాటు వేసి ప్రయాణికుల విలువైన సామాన్లు దొంగిలించే అంతరాష్ట్ర జేబు దొంగల
కిలాడీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం నగర ఏసీపీ హరికృష్ణ తెలిపారు.
ఆంద్రప్రదేశ్ లోని విజయనగరం, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల చెందిన ఏడుగురు ముఠా సభ్యులు
పధకం ప్రకారం ములుగు జిల్లాలో జరుగుతున్న మేడారం సమ్మక్క,సారలమ్మ మహా జాతరకు వెళ్లి అక్కడకు వచ్చే భక్తుల విలువైన వస్తువులు, డబ్బులను చోరీ చేసేందుకు రైలులో బయలుదేరారని తెలిపారు. నిందితులు ఖమ్మం రైల్వే స్టేషన్ లో దిగి ఖమ్మం బస్‌స్టాండు తదితర ప్రాంతాంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో ఈ ముఠా సభ్యుల వ్యవహారం బయట పడిందని తెలిపారు. నిందితులపై ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
రద్దీగా ఉండే జాతరల్లో, ఉత్సవాల్లో, బస్సుల్లో ప్రయాణికుల చుట్టూ నిలబడి దృష్టిని మరల్చి పర్సులు, బ్యాగ్ లు కత్తిరించి విలువైన వస్తువులు, డబ్బులు చాకచక్యంగా దొంగిలిస్తారని చెప్పారు. మేడరం జాతరకు వెళ్లే భక్తులు తమ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేశారు.
గత కొన్ని ఏళ్ళుగా ఆంద్రప్రదేశ్ లో చోరీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు, వీరిపై ఆయా జిల్లాలో 50 కేసుల వరకు నమోదు అయినట్లు తెలిపారు.
అరెస్టయిన నిందితులు:
1) రావుల పార్వతి, 35 సం,,
R/o కొత్త వలస గ్రామం/మండలం, విజయనగరం జిల్లా
2) రావుల రమణ,40 సం,,
R/o కొత్త వలస గ్రామం/
మండలం, విజయనగరం జిల్లా.
3) దాసు యేసు మణి,23 సం,,R/o రంగాపురం గ్రామం, L. కోట మండలం విజయనగరం జిల్లా.
4 ) దాసు యాకూబ్, 29 సం,,
R/o రంగాపురం గ్రామం, L. కోట మండలం, విజయనగరం జిల్లా.
5) మల్లాది సిద్ధరావు, 40 సం,, R/o మాధవరం గ్రామం, ఎ. కొండూరు (మండలం), ఎన్టీఆర్ జిల్లా.
6) కొమ్ము రాము,30 సం,,R/o మాధవరం గ్రామం, ఎ.కొండూరు (మండలం), ఎన్టీఆర్ జిల్లా.