మీ అయ్య జాగీరా? నీ అయ్య పొలమా? నువ్వెవడివి? నీ తాత గాడిదా? ఒళ్ళు పగులుద్ది…నీ మొహం పాగులుద్దిరోయ్…ఏయ్.. నోరు ముయ్. చెత్త నా కొడకా…నీ యమ్మ…నీయబ్బ… డొక్క పగులుద్దిరరేయ్…రాస్కెల్…ఒంటి కన్నుగా…చెప్పు తెగుతది నా కొడకా…అందరి దగ్గర చెప్పినట్లు…నా దగ్గర కతలు చెప్పకురొయ్..ఒక్క సారీ…గెల్చినవ్ రా? వాడి కాళ్ళు నాకురా…బూట్లు నాకురా… బోడే ప్రసాద్ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నవ్ రా? సుజనా చౌదరి దగ్గర నువ్వు తీసుకోలేదార?…ఈ సంస్కార భాషా ప్రయోగం ఎవరో నిరక్షరాస్యులది కాదు. ఇద్దరు రాజకీయ నేతల మధ్య చోటు చేసుకున్న దూషణ పర్వం… వాళ్ళేమీ గల్లీ లీడర్లు కూడా కాదు. ఒకాయన వల్లభనేని వంశీ…గన్నవరం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. పశువుల డాక్టర్ కూడా. మరొకాయన బాబూ రాజేంద్ర ప్రసాద్. ఎమ్మెల్సీ కూడా. ఈ ఇద్దరు నాయకులు ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో పరస్పరం తిట్ల దండకం అందుకున్న వాటిలో కొన్ని పదాలు మాత్రమే. ఇంకా చాలా మాట్లాడుకున్నారు. అవన్నీ ప్రస్తావించాలంటే కొండవీటి చాంతాడంత అవుతుంది.
ఇంతకీ విషయమేమిటంటే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన సందర్భంగా ఓ న్యూస్ ఛానల్ డిబేట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఇద్దరి మధ్య జరిగిన ‘సంభాషణ’ తీరు చూసి ఛానల్ యాంకర్ కూడా కంగారు పడి పోయాడు. వంశీ అంతే…ఏదేని విషయంలో తనను విమర్శించే వారిపై ఒంటికాలిపై లేస్తారు. దివంగత దేవినేని నెహ్రూ తో కూడా గతంలో ఓ న్యూస్ ఛానల్ లో ఇదే టైపు గొడవకు దిగారు. నెహ్రూ, వంశీల మధ్య అప్పట్లో జరిగిన పంచాయతీ విజయవాడ ప్రజల్లో తెగ టెన్షన్ పుట్టించింది. బెజవాడ పోలీస్ కమిషనర్ గా సీతారామాంజనేయులు పని చేసిన కాలంలో కూడా వంశీ న్యూస్ ఛానల్ లో మాట్లాడిన ఘటన అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారి తీసింది. తాజాగా రాజేంద్ర ప్రసాద్, వంశీల మధ్య మాటల తీవ్రత మరోసారి బెజవాడ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఈ మొత్తం తిట్ల దండకంలో కొన్ని విశేషాలు కూడా ఉన్నాయండోయ్. ఒకటి అయ్యప్ప మాలలో గల వంశీ ఆవేశానికి లోనై తిట్ల పురాణం ప్రారంభించగా, రాజేంద్ర ప్రసాద్ టీవీ డిబేట్ లో తొలిసారి ఇటువంటి అనుభవాన్ని చవి చూడడం. ఇంకా కొస మెరుపు ఏమిటంటే…ఈ ఇద్దరు నేతల పరస్పర దూషణను. నియంత్రించే ప్రక్రియలో ‘ ఇప్పటి వరకు డీసెంట్ ‘ గా మాట్లాడుకున్నారని యాంకర్ వ్యాఖ్యానించడం.