రాజకీయాల్లో గెలుపు, ఓటమి లెక్కలు వేసుకుంటే నిన్నటి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పరిణామం చంద్రబాబు నాయుడి గెలుపుగానే చూడాలి. రాజకీయంగా వ్యూహం రచించి విజయం సాధించారు.
జగన్ పూర్తిగా వైఫల్యం చెందారు. ఆయన రాజకీయ వ్యూహం (ఒకవేళ వ్యహం ఉండి ఉంటే) బెడిసి కొట్టింది.
కానీ చంద్రబాబు విజయాన్ని, వ్యూహాన్ని రాజ్యాంగపరంగా చూసినా, ప్రజాతీర్పును దృష్టిలో పెట్టుకుని విచక్షణతో చూసినా భారీ తప్పిదంగానే భావించాల్సి ఉంటుంది. ప్రజా తీర్పును గౌరవించకుండా ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీయే ఇంకా ఆధిపత్యం చెలాయించాలి అనుకుంటే ఎలా? అలాంటప్పుడు ప్రజాతీర్పునకు విలువేంటి?
రేపు.. ఐదేళ్ళ తర్వాత ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెంది మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చి కూర్చుంటే, అప్పటికి పెద్దల సభలో (శాసనమండలి) వైసీపీ ఆధిక్యంలో ఉంటుంది కదా!?
అసలు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చేటప్పటికే శాసనమండలిలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది కదా? తన ఆధిక్యాన్ని ఉపయోగించి కాంగ్రెస్ శాసన మండలిని, శాసనసభ నిర్ణయాలకు భిన్నంగా రాజకీయ కారణాలతో నడిపి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది?
వీటన్నిటికీ నేటి రాజకీయ నాయకులు భావితరాల కోసమైనా జవాబు చెప్పాల్సి ఉంటుంది.
-దారా గోపి @fb