అల్లుడంటే అల్లుడే… అత్తగారింట్లో అల్లునికి మర్యాదల్లో ఏ లోటూ రాకూడదని అంటుంటారు. అందుకే కాబోలు… అల్లుడికి మర్యాదల విషయంలో ఓ ఆంధ్రా అత్తగారు ఏం చేశారో తెలుసా? 67 రకాల ఆహార పదార్థాలను తయారు చేసి సంచలనం సృష్టించారు. ఆశ్చర్యపోతున్నారా? ఔను… అక్షరాలా అరవై ఏడు రకాల వంటకాలను ఈ అత్తగారు తన అల్లుడి కోసం రెడీ చేశారు. అందులో ఏయే వంటకాలు ఉన్నాయంటారా? వినబోతూ వివరాలెందుకు? అనంత్ రూపంగుడి అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన వీడియోలో వాటి వివరాలను వింటూ లొట్టలేయండి. వైరల్ గా మారిన వీడియోను చూశాక మీరు కూడా ఔరా… అనాల్సిందే!