మంచికో, చెడుకో. విజయమో, విరామమో. ఏదో ఒకటి. రాజధాని విస్తరణ ప్రస్తుతానికి ఆగింది. ఇది పునరాలోచన సమయం. ఈ విరామం ఒక శాశ్వత విజయానికి పునాది కావాలి. శాశ్వత విజయం నేతకో, పార్టీకో పరిమితం కాకుండా ప్రజలకు, భావితరాలకు వర్తించాలి.
ఒక్కోసారి ఓటమి కూడా మరింత గొప్ప విజయానికి పునాది అవుతుంది.
హైకోర్టు రాయలసీమ ప్రజల ఆకాంక్షల మేరకు తరలించవచ్చు. విశాఖ ఇప్పటికే ఐటీ, సినిమా రాజధానిగా ప్రయాణం మొదలు పెట్టింది. కలకత్తా, చెన్నయ్ వంటి రెండు పెద్ద నగరాల మధ్య తూర్పు కోస్తా తీరంలో మహానగరంగా, పర్యాటక క్షేత్రంగా వెలుగొందగల అవకాశాలున్న నగరం. ఈ నగరాన్ని అలా వెలుగొందనీయండి.
పరిపాలన (సచివాలయం – Executive), శాసన (అసెంబ్లీ – Legislature) రాజధాని విడగొట్టడం సముచితం కాదు. చంద్రబాబు నిర్ణయించిన ప్రదేశం రాజకీయంగా నచ్చకపోవచ్చు. దాన్ని అటో, ఇటో జరిపి చూడండి. చంద్రబాబు పెట్టిన పేరు నచ్చకపోవచ్చు. మీరే ఇంకో పేరు పెట్టుకోండి. భవిష్యత్ పాలకులు, భవిష్యత్ తరాలు చూసుకుంటాయి.
ప్రజలు ఇచ్చిన ఈ ఐదేళ్ళలో ఏం చేయగలరో అలోచించి చేయండి. మరో పాతికేళ్ళు అధికారం నాదే అనే అహం వద్దు. ఈ ఐదేళ్ళలో ఏం చెప్పారో అది చేయండి. ఏం చేయగలుగుతారో అవి చేయండి. పాతికేళ్ళ సంగతి ప్రజలు చూసుకుంటారు.
-దారా గోపి @fb