ఉభయ తెలుగు రాష్ట్రాలకు ట్రైనీ ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణా రాష్ట్రానికి రుత్విక్ సాయి కొట్టే, సాయికిరణ్, మనన్ భట్, యాదవ్ వసుంధరలను కేటాయించారు.
అదేవిధంగా ఏపీకి బొడ్డు హేమంత్, మనీషా వంగల రెడ్డి, దీక్ష, సుష్మితలను కేటాయించారు. మొత్తం ఎనిమిది మందితో నలుగురు తెలుగువారు కాగా, ఇద్దరు చొప్పున తెలంగాణా, ఏపీ రాష్ట్రాలకు చెందినవారే కావడం విశేషం. మిగతా నలుగురు హర్యానా, తమిళనాడు, జమ్మూకశ్మీర్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు.