Close Menu
    Facebook X (Twitter) YouTube
    Thursday, November 30
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»ఎవరా ఐఏఎస్…! ఎక్కడివి రూ. 450 కోట్లు…? ఏమా మల్టీప్లెక్స్ కథ…!?

    ఎవరా ఐఏఎస్…! ఎక్కడివి రూ. 450 కోట్లు…? ఏమా మల్టీప్లెక్స్ కథ…!?

    March 27, 20221 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 dasoju sravan

    ఏఐసీసీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ రాజకీయంగానే కాదు, అధికార వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ లో బీహార్ కు చెందిన సోకాల్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి రూ. 450 కోట్లతో భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారనే విషయాన్ని ప్రస్తావిస్తూ దాసోజు చేసిన ట్వీట్ తీవ్ర కలకలం రేపుతోంది.

    ఈ భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న ఆయా ఐఏఎస్ అధికారి ఎవరనే విషయం తెలంగాణా ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నట్లు తన ట్వీట్ లో పేర్కొన్నారు. తాను చేసిన ట్వీట్ ను సీబీఐ, ఏసీబీ విభాగాలకు దాసోజు ట్యాగ్ చేయడం విశేషం. అయితే దాసోజ్ శ్రవణ్ తన ట్వీట్ ద్వారా ఉటంకించిన ఆ ఐఏఎస్ అధికారి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.

    తెలంగాణాలో పనిచేస్తున్న బీహార్ కు చెందిన ఐఏఎస్ అధికారులపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల పలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దాసోజ్ శ్రవణ్ ప్రస్తావించిన బీహార్ ఐఏఎస్ అధికారి ఎవరు? అనే అంశం చర్చకు దారి తీసింది. దాసోజు శ్రవణ్ చేసిన ట్వీట్ ను దిగువన చూడవచ్చు.

    #Telangana wants to know who is that
    so called Senior IAS Officer from Bihar, who is building massive multiplexes worth Rs 450 Cr in Gurgaon. @CBItweets @anticorruption #CORRUPTION #Hyderabad pic.twitter.com/cn3wFzbv1N

    — Prof Dasoju Srravan (@sravandasoju) March 25, 2022
    bihar IAS officer issue dasoju sravan dasoju sravan tweet దాసోజు శ్రవణ్ దాసోజు శ్రవణ్ ట్వీట్ బీహార్ ఐఏఎస్ అధికారి
    Previous Article‘చూస్కుందాం…’ పోలీసులకు టీఆర్ఎస్ యూత్ లీడర్ సవాల్
    Next Article గంజాయి ‘స్మగ్లింగ్’లో టీఆర్ఎస్ నేత అల్లుడు

    Related Posts

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.