మహాదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమంలో శ్రాద్ధ కర్మలు నిలిపేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధ్దృతి దృష్ట్యా మే ఒకటవ తేదీ వరకు ఆయా కర్మలను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు బ్రాహ్మణ సేవా ప్రకటించింది. ఈ నెల 23 నుండి మే ఒకటి వరకు బ్రాహ్మణులెవరూ అస్థి విసర్జన, పిండ ప్రదానాలు చేయడం లేదని బ్రాహ్మణ సంఘం బాధ్యులు తెలిపారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో కరోనా ఉధృతంగా ఉండగా, కాళేశ్వరం పూజలకోసం మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని యాత్రికులు, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ శ్రాద్ధ కర్మలు స్వచ్ఛందంగా నిలిపివేసిందని తెలిపారు. భక్తులకు, అధికారులకు సహృదయంతో అర్ధం చేసుకునేందుకు ముందస్తు విజ్ఞప్తి చేస్తున్నామని అందరు సహకరించాలని కోరారు.