ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రజలకు మణులు, మాణిక్యాలు పంపిణీ చేయాల్సిన అవసరం లేదు. కష్టాల్లో ఉన్నపుడు కాస్త కనికరం చూపి, చేతనైన సాయం చేస్తే చాలు… ఆ నాయకుడి సేవను ప్రజలు తప్పక గుర్తుంచుకుంటారు. తాము అడిగిందే తడవుగా స్పందించారని, సాయం చేశారని సంబంధిత నాయకుడి గురించి గొప్పగా కీర్తిస్తారు. ఇందుకు ఉదాహరణ ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన మోటమర్రి సునీత అనే ఆర్యవైశ్య మహిళ.
తన భర్త కరోనా బారిన పడిన కల్లోల సమయంలో ఎంపీ నామ నాగేశ్వరరావు చేసిన సాయంపై సునీత భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటి కరోనా పరిస్థితి వేరు, ప్రారంభంలో కరోనా ప్రమాద ఘంటికల స్థితి వేరు. అటువంటి కష్టసమయాన నామ నాగేశ్వరరావు తన భర్త ప్రాణం కాపాడేందుకు చూపిన శ్రద్ధను ఆమె భావోద్వేగానికి గురై వెల్లడించారు. ‘దేవుడు పంపించిన దేవుడు’ అని నామ నాగేశ్వరరావును అభివర్ణిస్తూ, ఆయన చేసిన సహాయాన్ని కొనియాడారు.
ఎంపీ నామ నాగేశ్వరరావు శుక్రవారం సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా చోటు చేసుకున్న ఈ దృశ్యంలో ఆయన చేసిన మేలు గురించి సునీత ఇంకా ఏమంటున్నారో దిగువన గల వీడియోలో చూసేయండి.