మరికొద్ది సేపట్లో ఏర్పడనున్న సూర్యగ్రహణం కరోనా వైరస్ నాశనానికి కారణమవుతుందా? అవుననే అంటున్నారు సైన్స్ నిపుణులు. జీవక్రియలు సవ్యంగా సాగడానికి ఉపకరించే ‘డి’ విటమిన్ ఉదయ భానుడి కిరణాల నుంచి లభ్యమవుతుందేని అందరికీ తెలిసిందే. ఇదే దశలో నేటి సూర్యగ్రహణం వల్ల కరోనా వైరస్ కొంత వరకు నాశనమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఈ ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.44 గంటల వరకు తెలంగాణాలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ అద్భుత వలయాకర సూర్యగ్రహణం వల్ల కరోనా వైరస్ కొంత మేర నశించే అవకాశమున్నట్లు ఇండియా ప్లానెటరీ సొసైటీ డైరెక్టర్ రఘునందన్ కుమార్, సైన్స్ నిపుణులు డాక్టర్ విజయ భాస్కర్ మీడియాకు తెలిపారు. గ్రహణం వల్ల భూమ్మీద పడే అతి నీలలోహిత కిరణాల కారణంగా కరోనా వైరస్ 0.001 శాతం మేరకు నశించే అవకాశముందని ఆయా నిపుణులు నిర్వచించారు.