ts29.in ప్రచురించిన వార్తా కథనానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణా మున్సిపల్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చలించారు. జీవచ్ఛవంలా మారిన మొక్కకు ప్రాణం పోసే ప్రక్రియకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ‘మౌనంగానే ఎదగలేక.. మీకు చెబుతున్న వ్యథ ఏమనగా’ శీర్షికతో ఈనెల 27న ప్రచురించిన వార్తా కథనానికి కేటీఆర్ స్పందించడం విశేషం. హైదరాబాద్ నగరంలోని మాసాబ్ టాంక్ సమీపాన గల రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయ ఆవరణలో కేటీఆర్ చేతుల మీదుగా నాటిన మొక్క దీన స్థితిపై ts29.in వార్తా కథనాన్ని ప్రచురించింది.
ఈ వార్తా కథనం కేటీఆర్ దృష్టికి వెళ్లడంతో మొక్క సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఎన్నికల సంఘం కార్యాలయ అధికారులు కేటీఆర్ నాటిన మొక్కను బతికించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు దానికి నీళ్లు పోస్తూ, అవసరమైన సంరక్షణ ప్రక్రియను ప్రారంభించారు. జీవచ్ఛవంలా మారిన ఈ మొక్క రెండు, మూడు రోజుల్లో చిగురిస్తుందని, ఆకులు కూడా వస్తాయని కార్యాలయ వర్గాలు చెప్పాయి. కేటీఆర్ నాటిన మొక్కకు నీరు పోస్తున్న బుధవారం నాటి దృశ్యాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు.
ఇదీ చదవండి: https://ts29.in/a-plant-letter-to-telangana-minister-kt-ramarao/