ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం సేకరణ సాధ్యపడదని, ఇందుకు అనేక అంశాలు ముడిపడి ఉంటాయని స్పష్టం చేసింది. పరిస్థితుల ఆధారంగా ధాన్యం సేకరణ జరుగుతుందని పేర్కొంది. ఎఫ్ సీఐతో చర్చించి ప్రణాళిక ప్రకారం ధాన్యం సేకరణ జరుపుతామని ప్రకటించింది.

సేకరించిన ధాన్యాన్ని జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం తిరిగి రాష్ట్రాలకు పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించింది. కనీస మద్ధతు ధర, డిమాండ్, మార్కెట్ ధరల మేరకు సేకరణ జరుగుతుందని స్పష్టం చేసింది. లోక్ సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం రాతపూర్వక సమాధానం చెప్పింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి ఈమేరకు సమాధానం చెప్పారు.

ఇదిలా ఉండగా రాజ్య‌స‌భ లాబీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌ను టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యులు క‌లిశారు. రాజ్య‌స‌భ స‌భ్యులు కే కేశ‌వ‌రావు నేతృత్వంలో క‌లిసిన ఎంపీలు ధాన్యం సేక‌ర‌ణ అంశంపై పీయూష్ గోయ‌ల్ తో ప్ర‌స్తావించారు. ఈ అంశంపై మీతో చ‌ర్చించేందుకు న‌లుగురు మంత్రులు ఢిల్లీ వ‌చ్చార‌ని, అపాయింట్‌మెంట్ ఇవ్వాల‌ని గోయ‌ల్‌ను కేశ‌వ‌రావు కోరారు. అయితే రేపు షెడ్యూల్ చూసుకుని స‌మ‌యం ఇచ్చేందుకు ప‌రిశీలిస్తాన‌ని పీయూష్ గోయ‌ల్ కేశవరావుకు తెలిపారు.

ఫొటో: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Comments are closed.

Exit mobile version