వసూళ్ల దందాకు పాల్పడుతున్న ఎనిమిది మంది విలేకరులపై ఖమ్మం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో సత్తుపల్లి కేంద్రంలో పనిచేసే ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్ కూడా ఉండడం గమనార్హం. ఎనిమిది మంది విలేకరులతోపాటు మరో వ్యక్తి తనను బెదిరించి రూ. 1.20 లక్షలు వసూల్ చేశారని వీఎం బంజర హాస్టల్ వార్డెన్ వెంకటేశ్వర రావు పెనుబల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సత్తుపల్లి, పెనుబల్లి మండలాలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన విలేకరులు తన వద్ద నుంచి లక్షా 20 వేల నగదు తీసుకుని, మరింత మొత్తం డబ్బు కావాలని బెదిరిస్తూ, వేధిస్తున్నారని వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.