తినడానికి తిండే సరిగ్గా లేదు… ఈ తాగుడేంది…? ఆ ఊగుడేంది…? కనీసం భౌతిక దూరమేది…? ఇదేం పద్ధతి అంటూ ఓ మహిళ బడితె చేబూనింది. ఏకంగా మద్యం షాపు ముందే తిష్టవేసి లిక్కర్ కోసం వచ్చినవారిపై దండెత్తింది. చిన్నా, పెద్దా తేడా లేనే లేదు. కనిపించిన లిక్కర్ బాబులపై బడితెయాత్ర చేసింది. కడుపు తరుక్కుపోతోందని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు కూడా ఆమెను నిలువరించే పరిస్థితి లేదు. పోలీసులు చేయలేని పనిని ఓ మహిళ చేస్తోందనే వ్యాఖ్యలు కూడా ఈ వీడియోలో వినిపిస్తున్నాయి. తాగుబోతులను వణికించిన ఆసక్తికర దృశ్యాన్ని విజువల్ రూపంలో దిగువన చూడండి.