బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, కొందరు పోలీసు అధికారుల మధ్య అస్సలు పొసుగుతున్నట్లు కనిపించడం లేదు. ఆర్టీసీ సమ్మె, ఓ డ్రైవర్ మృతి ఘటన సందర్భంగా కరీంనగర్ పోలీసుల, సంజయ్ మధ్య వివాదాం ఏర్పడిన సంగతి తెలిసిందే. చిలిచి చిలికి గాలివానగా మారిన చందంగా అప్పటి ఘటన పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ వరకు దారి తీసింది.
తాజాగా సంజయ్ కుమార్, మరో పోలీసు అధికారి మధ్య వాగ్వాదపు ఘటన చోటు చేసుకుంది. గాలివాన, ఈదురుగాలుల కారణంగా హైదరాబాద్ సమీపంలోని కోహెడ పండ్ల మార్కెట్ ధ్వంసమైన సంగతి తెలిసిందే. పండ్ల వ్యాపారులను పరామర్శించడానికి సంజయ్ ఘటనా స్థలికి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులకు, సంజయ్ కి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ‘ఓ ఎంపీతో మాట్లాడే పద్ధతి ఇదేనా? వార్నింగ్ ఇస్తున్నారా?’ అంటూ సంజయ్ ప్రశ్నిస్తుండగా, మంచిగా మాట్లాడాలంటూ వనస్థలిపురం ఏసీపీగా భావిస్తున్న పోలీసు అధికారి జవాబిచ్చిన వాగ్వాదపు ఘటన వీడియోను దిగువన చూడవచ్చు.