‘రైతుల మీద మనం బతుకుతున్నం తప్ప, రైస్ మిల్లర్ల మీద రైతులు బతకరు. రైతులను బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదు. రైతాంగం పట్ల దురుసుగా ప్రవర్తించడం, వారిని చిన్న చూపు చూడడం, దౌర్జన్యాలకు పాల్పడడం వంటి చర్యలకు మిల్లర్లు దిగుతున్నారు. ఇట్లాంటి వెర్రి వేషాలు వేస్తే, రైతులను సతాయిస్తే తప్పకుంట పనిష్మెంట్ ఉంటది’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఇది క్షమించరానిది, మీ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. ‘బండి కింద కుక్క’సామెతను ఈ సందర్భంగా మంత్రి ఈటల గుర్తు చేసి మరీ నిర్వచించారు. రైతాంగ సమస్యలపై, రైస్ మిల్లర్ల ఆగడాలపై మంత్రి మంగళవారం హుజురాబాద్ పర్యటనలో మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారో దిగువన వీడియోలో వివరంగా వింటూ, చూడండి.