కరోనా కల్లోల పరిస్థితుల్లో కొండ, కోనల్లో ప్రయాణిస్తూ ఆదివాసీ ప్రజలకు ఆపన్న హస్తం అందిస్తున్న ధనసరి అనసూయ అలియాస్ సీతక్క తుపాకీ ధరిస్తే ఎలా ఉంటారు? వాగులు, వంకలు దాటుతూ, ఎడ్ల బండిపై, ట్రాక్టర్ పై వెడుతూ తన నియోజకవర్గ ప్రజలకు నిత్యావసర సరుకులను అందిస్తున్న సీతక్క పూర్వ కాలంలో నక్సలైట్ అనే విషయం తెలిసిందే. జనశక్తి పార్టీలో దళ కమాండర్ స్థాయిలో బాధ్యతలు నిర్వహించిన సీతక్క అప్పట్లో తుపాకీ ధరించిన అరుదైన ఫొటోలు ts29కు లభించాయి.
ఏకే-47 ఆయుధాన్నే కాదు ఎస్ఎల్ఆర్ తుపాకీని కూడా సీతక్క తన పూర్వ నక్సలైట్ జీవితంలో వినియోగించినట్లు ఆయా ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆదివాసీల ఆకలి తీర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఎమ్మెల్యే సీతక్క పలువురి ప్రశంసలను పొందుతున్నారు. ప్రస్తుత రాజకీయ జీవితంలో ప్రజారక్షణకు పాటుపడుతున్న సీతక్క పూర్వ జీవితంలో తుపాకీ పట్టుకుని దళం సంరక్షణకు గస్తా కాస్తూ ‘సెంట్రీ’ డ్యూటీ చేస్తున్న దృశ్యాన్ని కూడా ఫొటోలో చూడవచ్చు.
ఇదీ చదవండి: అడవిలో ‘మాజీ’ అక్క… భళా… ఎమ్మెల్యే సీతక్క!