వ్యక్తి కాదు… వ్యవస్థే ముఖ్యం. ప్రజా సంరక్షణే ప్రధాన కర్తవ్యం. ఎటువంటి వివాదాస్పద ఘటనలు లేవు. చిల్లర, మల్లర గొడవలు అసలే లేవు. సర్వత్రా ప్రశాంతం. పట్టపగలే కర్ఫ్యూను తలపిస్తున్న వాతావరణం. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పటిలాగే తమ విధులు నిర్వహిస్తోంది. తమ వ్యవస్థలో ఎటువంటి ఆత్మస్థయిర్యం దెబ్బ తినలేదని రుజువు చేస్తోంది ఖమ్మం జిల్లా పోలీసు శాఖ. ఓ వ్యక్తి కోసం తమ బాధ్యతను విస్మరించేది లేదని చెప్పకనే చెబుతోంది.
ఓ వర్గపు విష ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఖమ్మం జిల్లా పోలీసు యంత్రాంగపు చిత్తశుద్ధి విధి నిర్వహణకు ఈ చిత్రాలు సజీవ సాక్ష్యం. ఇవి ఫైల్ ఫొటోలు కావు… మసి పూసి మారేడు కాయ చేసేందుకు. ఆదివారం మిట్ట మధ్యాహ్నం ఖమ్మం నగర వీధుల్లో తీసిన ఫొటోలివి. ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ నగర నడివీధుల్లో నిలబడి తమ సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నారు. ఏ ఒక్కరి కోసం జిల్లా పోలీసు శాఖ తమ మనో నిబ్బరాన్ని కోల్పోలేదని, ఓ వర్గపు చౌకబారు ఎత్తుగడలను చిత్తు చేస్తూ కరోనా వైరస్ కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలకు సజీవ సాక్ష్యం ఈ దృశ్యమాలిక. వీక్షించండి.