కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, రాష్ట్ర సచివాలయం, ఎమ్మెల్యే ల క్యాంప్ కార్యాలయాల్లో, మంత్రుల అధికారిక నివాస గృహాల్లోకి విజిటర్స్ అనుమతులు రద్దు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంతేగాక రహదారుల వెంబడి ఎక్కువగా జనసమూహం ఉండకుండా తగుజాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీచేసే యోచన చేస్తోంది.
ఇదిలా ఉండగా మరోవైపు మంత్రులు, అధికారులు, ప్రభుత్వ కార్యాలయాలకు కోవిడ్ వైరస్ 19 మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. వాటి వివరాలు:
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ స్కానర్ లు ఏర్పాటు చేయాలి.
తప్పనిసరిగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలి.
ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉంటే చికిత్స అందిస్తూ క్వారన్తటైన్ కు తరలించాలి.
కార్యాలయాలకు వచ్చే సందర్శకుల సంఖ్యను కట్టడి చేయాలి.
వెంటనే ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చే విజిటర్ పాస్ లను రద్దు చేయాలి.
అధికారుల అనుమతి తో వచ్చే సందర్శకులను స్క్రీనింగ్ తరువాతే లోనికి అనుమతి ఇంచాలి
సమావేశాలను వీలైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్ లకే పరిమితం చేయాలి.
తప్పనిసరి అయితే తప్ప వీలైనంత తక్కువ మందితోనే ప్రభుత్వ సమీక్షలు, సమావేశాలు ఉండాలి.
అవసరం లేని అధికారిక ప్రయాణాలు రద్దు చేసుకోవాలి.
అవసరమైన సమాచారాన్ని ఫైల్స్, డాక్యుమెంట్ల రూపంలో ఇతర కార్యాలయాలకు పంపించవద్దు .అవసరమైతే మెయిల్ సౌకర్యం ఉపయోగించుకోవాలి.
కార్యాలయం ఎంట్రీ పాయింట్ వద్ద నుండే దరఖాస్తులు తీసుకోవడం ఇవ్వడం చేయాలి.
ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఉన్న జిమ్స్, శిశు సంరక్షణ కేంద్రాలను మూసివేయాలి.
ఉద్యోగులు పనిచేసే చోట తరుచుగా శుభ్రం చేయాలి, శానిటేషన్ చేసుకోవాలి.
ప్రభుత్వ కార్యాలయంలోని వాష్ రూమ్,టాయిలెట్ రెగ్యులర్ గా షానిటైజర్, సోప్ లు నిరంతరం నీటి సరఫరా చేయాలి.
అధికారులకు అందరికీ మీ ఆరోగ్యం మీరే పరిరక్షణ చేసుకోవాలనే సలహా ఇవ్వాలి.
శ్వాస సంబంధిత ఇబ్బందులు, జ్వరం, అస్వస్థత ఉంటే ఉద్యోగ స్థానం నుండి వెళ్లిపోవాలి. తరువాత పై అధికారులకు సమాచారం ఇవ్వాలి. వెంటనే హోమ్ క్వారన్తటైన్ లో ఉండాలి
సెల్ఫ్ క్వారన్తటైన్ లో ఉన్నవారీ రిక్వెస్ట్ మేరకు వెంటనే పై అధికారులు సెలవు మంజూరు చేయాలి.
సీనియర్ ఉద్యోగులు, గర్భిణీ మహిళా ఉద్యోగులు సీరియస్ రోగాలు కండిషన్ ఉన్న ఉద్యోగులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి ఉద్యోగులను ప్రజలతో నిత్యం కలిసే పనులను అప్పగించవద్దు.