అభివృద్ధి, సాంకేతిక… ఎన్నయినా చెప్పండి. కొన్నింటిని ఎవరూ చెరపలేరు. ఎప్పటికీ చెరిగిపోవు. ఎవరి వల్లా కాదు కూడా. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా… పేరు ఏదైనా కానీయండి… వాటి పోకడలు ఏ రూపాంతరమైనా చెందనీయండి. సాంకేతికతకు మరో పేరుగా ప్రపంచ వ్యాప్తంగా మెయిన్ స్ట్రీమ్, సోసల్ మీడియా ప్రాచుర్యం పొందినా ఫరవాలేదు. కానీ ఇప్పటికీ ఆ మీడియా మాత్రం ఎవర్ గ్రీన్. ఓ రకంగా చెప్పాలంటే అతనే అసలు, సిసలైన జర్నలిస్ట్. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
కావాలంటే దిగువన గల వీడియోను చూడండి. ఇది దండోరా లేదా చాటింపు మీడియా. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ డప్పు చాటింపు ద్వారా చెప్పే విషయాన్నే ప్రజలు బలంగా విశ్వసిస్తుంటారు. డప్పు చప్పుడు వినిపిస్తే చాలు పల్లె ప్రజలు చెవులు రిక్కరించి మరీ వింటుంటారు. అందుకే కాబోలు… ప్రపంచ దేశాలను తీవ్రంగా భయపెడుతున్న ‘కరోనా’ వైరస్ గురించి ప్రభుత్వ అధికారులు పల్లెల్లో ఎలా చాటింపు వేయిస్తున్నారో దిగువన కళ్లారా వీక్షించండి. అందుకే ఇది ఎవర్ గ్రీన్… ఎప్పటికీ చెరగని మీడియా అనే విషయాన్ని అందరూ అంగీకరించక తప్పదు మరి!