ఫ్లెక్సీలందు ఈ ఫ్లెక్సీ ప్రత్యేకత వేరు. పుట్టిన రోజు, చచ్చినరోజు, పెళ్లికీ, పేరంటానికీ, సన్మాన రోజు, తద్దినం రోజు, పిండాకూడు రోజు… ఒకటేమిటి? ప్రతి సందర్భానికీ ఫ్లెక్సీల కల్చర్ చూస్తున్నాం కదా! చివరికి ‘శోభనపు’ ఫ్లెక్సీ కల్చర్ కూడా మొదలైంది. కావాలంటే దిగువన గల ఓ ‘వింత’ ఫ్లెక్సీని చూడండి. తన శోభనానికి ఓ యువకుడు ఎలాంటి ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నాడో. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఏర్పాటు చేసినట్లు ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గోదావరి జిల్లాల వారికి కాస్త ‘వెటకారం’ ఎక్కువనే ప్రచారం ఉండనే ఉంది. ఇదీ అందులో భాగం కాదుగా? అని నెటిజన్లు వెటకరిస్తున్నారు. శోభనానికీ మొదలైన కొత్త సంస్కృతిగా అభివర్ణిస్తున్నారు.