ఈ మధ్యాహ్నం మూడు గంటలకు కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాజకీయంగా ఏ బాంబును పేల్చబోతున్నారు? ఈమేరకు ఆయన మీడియాకు స్పెషల్ ఇన్విటేషన్ పంపడం విశేషం. జర్నలిస్టుగా మీ జీవితంలో once in a lifetime experience ఇస్తానని రేవంత్ జర్నలిస్టులకు హామీ ఇవ్వడమే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ రేవంత్ ఎటువంటి సంచలన అంశాన్ని బహిర్గతం చేయబోతున్నారు? అది భూ సంబంధిత వ్యవహారమా? రాజకీయంగా మరేదైనా సంచలన నిర్ణయమా? ఏమిటి? తెలంగాణా వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే ఉత్కంఠ. ముఖ్యంగా మీడియా సర్కిళ్లలో, రాజకీయ వర్గాల్లో ఈ అంశం తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. రేవంత్ ఏం చెబుతారో మరి కొద్ది నిమిషాల్లోనే న్యూస్ ఛానళ్లలో చూడవచ్చంటున్నారు.
UPDATE:
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పై భూ వివాద ఆరోపణల పేరుతో మల్కాజ్ గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మీడియాను తన వెంట తీసుకుని బయలుదేరినట్లు సమాచారం. కేటీఆర్ ఫాం హౌజ్ గా పేర్కొంటున్న ప్రదేశానికి మీడియాతో కేటీఆర్ వెళ్లినట్లు వార్తలు అందుతున్నాయి. అయితే కేటీఆర్ నిర్దేశిత ప్రదేశానికి వెళ్లగలిగారా? మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారా? అనే విషయాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.