సోషల్ మీడియాలో ఒక్కోసారి ‘పంచ్’లు భలే పేలుతుంటాయ్… అందుకే సోషల్ మీడియా ధాటికి అనేక మంది బెంబేలెత్తుతుంటారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి ఆంధ్రజ్యోతి పత్రిక గురువారం ప్రచురించిన వార్తా కథనంపై సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్ట్ ఇది. ఓ ప్రధాని, మరో ముఖ్యమంత్రి స్థాయి నేతల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి వార్తా కథనాన్ని ప్రచురించిన ఆంధ్రజ్యోతి ‘దమ్ము’ను పేరాల కొద్దీ అక్షరాలను గుమ్మరించి ట్రోల్ చేయకుండా కేవలం ఓ ఫొటో, నాలుగు వాక్యాలతో సెటైర్ గా విసిరిన పోస్ట్ ను దిగువన చూడండి. ఎన్ని కాలమ్స్ లో వార్త రాసినా, ఇంతగా హత్తుకు పోయే విధంగా వ్యంగ్యాస్త్రం విసరడం సాధ్యం కాదనేది నిర్వివాదాంశం.