ఈ చిత్రానికి కూడా పేరాల కొద్దీ వార్తా కథనం అవసరం లేదు. మీరు చూస్తున్న ఈ దృశ్యం తాజా ఘటనకు సంబంధించిందే. ఫొటోలో ఆసీనులై ఉన్నవారిలో ఎడమ నుంచి కుడికి వరుసగా ములుగు ఎమ్మెల్యే సీతక్క, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ములుగు జెడ్పీ చైర్మెన్ జగదీష్, మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మెన్ ఆలం రామ్మూర్తి ఉన్నారు. రామ్మూర్తి పక్కనే ఉన్న వ్యకి ఎవరన్నది చివరలో తెలుసుకుందాం.
ఇక నిల్చున్నవారిలో ఇద్దరు ముఖ్యులు ఉన్నారు. గుర్తు పట్టారు కదా? పునుద్ధరణ కమిటీ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్థిక దాతగా ప్రాచుర్యం పొందిన వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి. అతని పక్కన ఉన్నది ఎవరో తెలుసా? మరో పది రోజుల్లో మేడారం జాతరకు హాజరయ్యే దాదాపు కోటిన్నర మంది భక్తులకు సకల సౌకర్యాల కల్పనను స్వయంగా పర్యవేక్షిస్తున్న ములుగు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. ఇంతకీ కూర్చున్నవారిలో ఆలం రామ్మూర్తి పక్కన ఉన్నది ఎవరో తెలుసుకోవాలని ఉంది కదూ? అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సాధారణ కార్యకర్త(ట). పేరు పల్ల బుచ్చయ్యగా సమాాచారం.
తాడ్వాయిలో హరిత హోటల్ ప్రారంభం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశం సందర్భంగా కనిపించిన ‘సిత్రం’ ఇది. అదీ సంగతి.