కొంగలుగాని, బాతులు గాని చేపలు కనిపిస్తే ఏం చేస్తాయి? వాటిని తమ పొడవాటి ముక్కున కర్చుకుని గుటుక్కున మింగేస్తాయి. ఎందుకంటే చేపలు వాటి ఆహారం కాబట్టి. కానీ ఇక్కడ ఓ బాతు తన జాతి వైరాన్ని మరచి చేపలతో స్నేహం చేయడం విశేషం. అంతేకాదు తన పొట్ట నింపడానికి పెంపకందారులు ఏర్పాటు చేసిన వరి గింజలను చేపల నోటికి అందిస్తూ వాటి ఆకలిని తీరుస్తుండడం గమనార్హం. ఇండియన్ ఫారెస్ట్ అధికారి (ఐఎఫ్ఎస్) ప్రవీణ్ కాశ్వన్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేపకు ఆహారాన్ని అందిస్తున్న వీడియోను దిగువన వీక్షించాక వావ్..క్యా ‘బాతు’హై అనాల్సిందే.