బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణా హైకోర్టులో చుక్కెదురైంది. ఏసీబీ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ను కొట్టి వేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ పిటిషన్ ను హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది.
ఏసీబీ దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం నడుచుకోవాలని సూచించింది. తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న కేటీఆర్ వినతిని హైకోర్టు తిరస్కరించింది. అంతేకాదు అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఉపసంహరించింది.
ఈ నేపథ్యంలో ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ పై విచారణ జరిపేందుకు దర్యాప్తు సంస్థలు దూకుడుగా వ్యవహరించే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసిన పరిణామాల్లో తన లీగల్ టీంతో కేటీఆర్ చర్చిస్తున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచన కేటీఆర్ చేస్తున్నట్లు సమాచారం.