చైనాను వణికిస్తున్న హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్ఎంపీవీ) వైరస్ మన దేశానికి చేరుకుంది. ఇండియాలోనూ రెండు కేసులు వెలుగు చూడడం కలకలం రేపుతోంది. ఈమేరకు కర్నాటకలో రెండు కేసులను గుర్తించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ నేపథ్యంలో అటు కేంద్రంతోపాటు ఇటు తెలంగాణా ప్రభుత్వం కూడా అప్రమత్తమైన సంగతి తెలిసిందే. బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారిలో ఈ వైరస్ ను పాజిటివ్ గా తేలినట్లు జాతీయ మీడియా కథనాలు నివేదిస్తున్నాయి.