హీరో అల్లు అర్జున్ ను తెలంగాణా పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. హీరో అల్లు అర్జున్ ఇదే థియేటర్ లో అభిమానుల మధ్య ప్రీమియర్ షో చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కసలాటలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీజ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై బీఎన్ఎస్ చట్టంలోని 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే ఉదంతంలో థియేటర్ కు సంబంధించిన ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ హీరో అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పరిణామాల్లోనే శుక్రవారం అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టు ప్రత్యక్ష దృశ్యాన్ని ఇక్కడ చూడవచ్చు.