బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖర్ ను సోమవారం కలిశారు. రాజ్యసభ ఛైర్మన్ కూడా అయిన జగదీప్ ధనఖర్ తో వద్దిరాజు ఈ సందర్భంగా సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా రాజ్యసభలోని ఛైర్మన్ ఛాంబర్ కు ఎంపీ వెళ్లి ధనఖర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.