చాలా కాలం తర్వాత తెలంగాణా గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ‘బల ప్రదర్శన’ చేశారా? అంటే ఔననే చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది. గత కొన్నేళ్లుగా వివాదాస్పద అధికారిగా అనేక అంశాల్లో తీవ్ర సమస్యలను చవి చూసిన ఏలూరి శ్రీనివాసరావు తన సొంత జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులతో బల ప్రదర్శనకు దిగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘సకల ఉద్యోగుల వన సమారాధన’ పేరుతో నిర్వహించిన కార్తీక మాస వన భోజనాల కార్యక్రమాన్ని ఏలూరి తనదైన శైలిలో నిర్వహించినట్లు ఉద్యోగ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అయితే తాజాగా నిర్వహించిన కార్యక్రమంలోనూ ఏలూరి శ్రీనివాసరావు వార్తల్లోకి రావడం గమనార్హం. వన భోజనాలకు సరికొత్త నిర్వచనాన్ని చెబుతూ ఖమ్మం నగరంలో భారీ ఎత్తున ఫ్లెక్సీల ఏర్పాటు, మీడియా సంస్థలకు లక్షల రూపాయలు వెచ్చించి ప్రకటనలు గుప్పించడం వంటి అనేక అంశాలు వివాదాస్పదమయ్యాయి.
ఖమ్మం నగర శివార్లలోని గొల్లగూడెం రోడ్డులో గల చెరుకూరి మామిడి తోటలో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ (టి.జి.ఈ.జే.ఏ.సి.) ఆధ్వర్యంలో నిర్వహించినట్లు వెల్లడించినప్పటికీ, ప్రోగ్రాం కర్త, కర్మ, క్రియల వ్యక్తిగా ఏలూరి శ్రీనివాసరావు మాత్రమేననే చర్చ జరుగుతోంది. దాదాపు 20 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు హాజరైనట్లు పేర్కొంటున్న కార్యక్రమంలో ఏలూరి శ్రీనివాసరావే ప్రధాన ఆకర్షణగా నిలవడం విశేషం.
ఇక కార్యక్రమానికి హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ, ఉద్యోగులు సహకరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఇద్దరు మంత్రులకు ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు, చైర్మన్ మారం జగదీశ్వర్ లు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
తొలుత మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, ఉద్యోగులు కోరుకున్న మార్పు ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ముఖ్యమంత్రి ధైర్యం చేసి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. బ్యాలెట్ పేపర్ లలో ప్రభుత్వ ఉద్యోగులు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రజల అవసరాలు గమనించే ఉద్యోగులు ఇచ్చిన తీర్పుగా ఇది భావిస్తామని, ప్రజల కష్టాలను తీర్చగలిగేది ఉద్యోగులు మాత్రమేనని అన్నారు. ప్రజలు తమకు జరిగే మంచిలో అధికారుల, ఉద్యోగుల పేర్లు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారని మంత్రి తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర సాధనలో 204 ఉద్యోగ సంఘాలు ఏకధాటిగా పోరాటం చేశాయని, వీరి పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం రావాలని ఉద్యోగుల కోరడంతో నేడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఉద్యోగి, మహిళా, రైతు, జర్నలిస్టులు వారి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలిపే అవకాశం లేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అవుతుందని, ఉద్యోగులకు భరోసా కల్పించడమే కాకుండా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని అన్నారు.
రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం చర్చించారని, ఆర్ధికేతర ఇబ్బందులను వచ్చే మార్చి లోపల పూర్తి చేస్తామని అన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఉద్యోగులు సంతృప్తి చెందే విధంగా, వారి ముఖంలో చిరునవ్వు వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందుల్లేని సమస్యలను ఈ సంవత్సరం క్యాలెండర్ మారే లోపల పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు.
ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ, గత 10 నెలల కాలంలో నిర్బంధ ప్రభుత్వం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చాక మన హక్కుల గురించి ప్రశ్నించే స్వేచ్ఛ మనకు లభించిందని, సీఎం మన సమస్యల పరిష్కారం కోసం మనతో సుదీర్ఘంగా చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు.
గత పది సంవత్సరాలలో ఉద్యోగుల జేఏసీ లేదని, సర్వీస్ రూల్స్ లేవని , ప్రశ్నిస్తే ప్రతిబంధకాలు, క్రిమినల్ కేసులు నమోదు చేశారని అన్నారు. రాబోయే మార్చి తర్వాత ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని, దీపావళి తర్వాత ఆర్థికేతర సమస్యలు పరిష్కరించడంతో పాటు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, శాసనమండలి సభ్యులు ఏ. నర్సిరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్, ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, టీజీఓ జిల్లా అధ్యక్షులు కస్తాల సత్య నారాయణ, టి.జి. ఓ. జిల్లా ప్రధాన కార్యదర్శి మోదుగు వేదాద్రి, టి.జి.హెచ్.డబ్ల్యు.ఓ. జిల్లా అధ్యక్షులు కోటిపాక రుక్మారావు, దేవరకొండ సైదులు, నాగిరెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉద్యో