రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ కలెక్టర్ నారాయణరెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా, టూరిజం డైరెక్టర్ గా పనిచేస్తున్న శ్రీమతి ఇల త్రిపాఠిని నల్లగొండ కలెక్టర్ గా, సమాచార శాఖలో స్పెషల్ కమిషనర్ గా ఉన్న ఎం. హన్మంతరావును యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు.
అదేవిధంగా ఎస్ సీ డీ కమిషనర్ గా ఉన్న డాక్టర్ టీకే శ్రీదేవిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా ఉన్న మందా మకరంద్ ను సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ గా, జెండగే హన్మంతును టూరిజం డైరెక్టర్ గా, కె. శశాంకను ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టు కమిషనర్ గా, రెవెన్యూ జాయింట్ సెక్రెటరీగా ఉన్న ఎస్. హరీష్ ను సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ గా బదిలీ చేశారు.
టి. వినయ్ క్రిష్ణారెడ్డిని ఎల్ఏ, ఆర్ అండ్ ఆర్ ఐ అండ్ సీఏడీ కమిషనర్ గా, పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న శ్రీమతి అయేషా మస్రత్ ఖానమ్ ను ప్రభుత్వ జాయింట్ సెక్రటరీగా, టీజీఐఐసీ ఈడీ ఉన్న నిఖిల్ చక్రవర్తిని సీటీ విభాగపు అదనపు కమిషనర్ గా, హాకా ఎండీ కె. చంద్రశేఖర్ రెడ్డిని రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేటివ్ ఫెడరేషన్ కు ఎండీగా, మేడ్చల్ మల్కాజిగిరి జెడ్పీ సీఈవో ఎస్. దిలీప్ కుమార్ ను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బదిలీ చేశారు.