రైతు రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి తుమ్మల నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటబీమా అంశాలపై కీలకోపన్యాసం చేశారు. తాము అనుకున్న సమయానికి తమకు అప్పు పుట్టకపోవడం వల్లే రుణమాఫీ ఆలస్యమైందన్నారు. అయినా సరే తాము ప్రమాణస్వీకారం చేసిన రోజుకు, డిసెంబర్ 9వ తారీఖునాటికి, సోనియాగాంధీ పుట్టిన రోజునాటికి రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.
ఇందుకు ‘ఈ మహానుభావుడు సంతకం పెట్టాలని, అందుకోసమే మూడు గంటలపాటు కూర్చున్నాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను చూపుతూ మంత్రి తుమ్మల ఛలోక్తి విసిరారు. రైతు రుణమాఫీ అనంతరం రైతు భరోసా అందించేందుకు కూడా కసరత్తు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆయా అంశాలపై మంత్రి తుమ్మల ఇంకా ఏమేం మాట్లాడారో ఈ దిగువన గల వీడియోలో చూసేయండి..