బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై, మాజీ మంత్రి హరీష్ రావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఇద్దరు బీఆర్ఎస్ నాయకులపై బీజేపీకి చెందిన ఎంపీ రఘునందన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ రఘునందన్ రావు, మంత్రి సురేఖ ఫొటో ట్రోలింగ్ పై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఈ ఫొటో ట్రోలింగ్ కు పాల్పడిన పలు యూ ట్యూబ్ ఛానెళ్లపైనా సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.