వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. సోమవారమే కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేయగా, కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్ ఖడ్ మంగళవారం ప్రకటించారు. ఈ పరిణామంతో రాజ్యసభలో వైసీపీ సభ్యుల బలం 11 నుంచి 8కి పడిపోయింది.
వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు ఇటీవలే తమ పదవులకు రాజీనామా చేశారు. కాగా తన పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉన్నప్పటికీ, కృష్ణయ్య రాజీనామా చేయడం గమనార్హం.తెలంగాణాలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే తన పదవికి రాజీనామా చేసినట్లు ఆర్. కృష్ణయ్య ప్రకటించారు.