అక్టోబర్ 16వ తేదీన విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో మంగళవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో మత్తయ్య సహా మిగతా నిందితులెవరూ హాజరు కాలేదు. దీంతో నిందితుల గైర్హాజరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో అక్టోబర్ 16వ తేదీన హాజరు కావాలని రేవంత్ రెడ్డిని కోర్టు ఆదేశించింది