సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కమ్మ సామాజిక వర్గానికి బంధువు కాబోతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయా కుటుంబానికి చెందిన అమ్మాయి, సండ్ర వెంకట వీరయ్య పెద్ద కుమారుడు భార్గవ్ పరస్పరం ప్రేమించుకున్నారు. అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడిన అంశానికి ఇరు కుటుంబాలు ఆమోద ముద్ర కూడా వేశాయి.
ఈ నేపథ్యంలోనే గత నెలలో సండ్ర వెంకట వీరయ్య పెద్ద కుమారుడు భార్గవ్ నిశ్చితార్థం హైదరాబాద్ లో జరిగింది. ప్రస్తుతం సండ్ర ఇంట్లో పెళ్లి బాజా మోగడానికి సర్వం సిద్ధమైంది. తన పెద్ద కుమారుడు భార్గవ్ వివాహానికి హాజరు కావలసిందిగా కోరుతూ బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును సండ్ర వెంకట వీరయ్య ఆహ్వానించారు
ఇందులో భాగంగానే సండ్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి శుక్రవారం సాయంత్రం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ను కలిసి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. సండ్ర కుమారుడు భార్గవ్ పెళ్లి చిద్విత సాయితో అక్టోబర్ 13వతేదీ ఆదివారం రాత్రి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జరుగనుంది.