ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం ఆరోపణలు, పోక్సో కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఈ తెల్లవారుజామున పోలీసులు అతన్ని హైదరాబాద్ కు తీసుకువచ్చి రహస్య ప్రదేశంలో విచారించారు. విచారణ సందర్భంగా పలు కీలక అంశాలపై పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం.
ఆ తర్వాత జానీ మాస్టర్ కు హైదర్ గూడలోని ఓ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచారు. జానీ మాస్టర్ కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ ను విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోలీసులు అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టంచిన సంగతి తెలిసిందే.