ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను సమర్పించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వద్దకు ఆప్ లెజిస్లేచర్ నాయకురాలు అతిశీని, ఇతర మంత్రులను కూడా కేజ్రీవాల్ తీసుకువెళ్లారు. ఇప్పటికే ప్రకటించిన ప్రకారం కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయగా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ వచ్చే వారం లోపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్లు ఆప్ వర్గాలు చెప్పాయి.