హంతకున్ని పట్టుకోవడానికి ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీసులు ఓ ప్రకటన చేశారు. గత నెల 29వ తేదీన కొణిజర్ల గ్రామ మాజీ సర్పంచ్ సూరంపల్లి రామారావు కత్తిపోట్లకు గురైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నాయకుడైన సూరంపల్లి రామారావుపై జరిగిన ఈ ఉదంతం రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా అధికార పార్టీ నేతల్లో కలవరం కలిగించింది. రామారావుపై జరిగిన కత్తిపోట్ల దాడి ఘటనపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా కొణిజర్ల పోలీసులు కోరుతున్నదేమిటంటే.. చిత్రంలో కనిపిస్తున్న టీ షర్టు ధరించిన గుర్తు తెలియని వ్యక్తి సూరంపల్లి రామారావు ఇంట్లోకి ప్రవేశించి అతనిపై హత్యాయత్నం చేశాడు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో గుర్తు తెలియని వ్యక్తి టీ షర్ట్ మాత్రమే పోలీసులకు ఆనవాలుగా లభించింది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఆయా టీ షర్ట్ ధరించిన వ్యక్తి ఆచూకీ తెలిసినట్లయితే కొణిజర్ల ఎస్ హెచ్ వో సెల్ నెం. 8712659150కు తెలియజేయాలని పోలీసులు కోరారు.