జియర్ గారి దివ్య సముఖమునకు..
అయ్యా!…
శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 7వ అధ్యాయం 21 శ్లోకములో
చెప్పినట్లుగా..
యో యో యాం యాం తనుం భక్తాః శ్రద్ధయార్చితుమిచ్ఛతి । తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేనని విదధామ్యహమ్ ।।
దీని అర్థం నాకు తెల్సినంతలో… ‘ఎవ్వరైనా, ఏదేవతనైనా పూజించినచో నేను అతని శ్రద్ధను స్థిరముచేసి ఆ దేవతకు అతడు భక్తుడగునట్లు చేయుదును’ అని స్వయంగా శ్రీ కృష్ణులవారే సెలవిచ్చారు కదా…?
సమ్మక్క – సారలమ్మలు బడుగు బలహీన వర్గాలవారికి అండగా నిలబడి కాకతీయులతో పోరాడి తమ ప్రాణాలు వదిలిన మహా యోధురాళ్ళు, ఉద్యమ కారులు. వారిని తెలంగాణ సమాజం దేవతలుగా కొనియాడుతూ…. పూజిస్తున్నది. దానివలన అందరికి మేలే జరుగుతున్నది. హిందూ సమాజం కోట్లలో వారిని మొక్కుతున్నారు. వారిని అమ్మవారి రూపంలో కొలుస్తున్నారు. దానివలన మీకొచ్చిన సమస్య ఏమిటి?
ఎవ్వరు ఏ రూపంలో, ఏ దేవతను కొలిచినా… వారికి నేనే ఆశీర్వాదం ప్రసాదిస్తున్నాను… అని గీతలో కృష్ణ పరమాత్మ చెబుతుంటే… మీలాంటి పండితులు ఇలా అందరు నమ్మే వన దేవతలపైన అనుచితమైన వ్యాఖ్యలుచేయడం ఎంతవరకు సమంజసం?
అరే ఇప్పటికే విదేశీ మతాల దుర్మార్గాలకు గిరిపుత్రులు బలౌతున్నారు. ఇతర మతాలు దేశాన్ని మతం పేరుతో కబలించాలని చూస్తున్నాయి. హిందూ సమాజాన్ని దేవుడి పేరుచెప్పి విడదీయాలని పన్నాగం పన్నుతున్న ఈ తరుణంలో మీలాంటి వారు ఇలాంటి మాటలు మాట్లాడి ఇతర మతాల విస్తరణకు తోడ్పాటునందించివట్లుకాదా?.. ఏటండీ ఇది?
మనకున్న ఉపనిశత్తులలో కాని, శాస్త్రాలలో కానీ, పురాణాలలో కాని ఎక్కడా తక్కువ జాతి వారిని గుడిలోనికి రానివ్వద్దు అని రాసి లేదే? మరి అప్పటి పండితులు ఎందుకు అణగారిన వర్గాలకు దేవుడిని దూరం చేశారు? అది తప్పు అనేకదా… అదే సమయం లో వేయి సంవ్సరాల క్రితమే ఓ మహానుభావుడైన రామానుజుడు తన గురువు ఇచ్చిన మంత్రాన్ని సైతం అందరికి గొంతెత్తి పంచారు. వారినే కదా మీరు పొగుడుతూ అంత పెద్ద సమతామూర్తిని ముచ్చింతల్లో ప్రతిష్టించారు. మరి అప్పుడే ఇలా ఎలా మాట్లాడుతున్నారు?
పైనుంచి అడవి దేవతలను పూజిస్తూ బిజినెస్ చేస్తున్నారు అని చెపుతున్నారు. మరి సమతా మూర్తిని దర్శించుకోవడానికి 150 రూపాయలు ఫీజు ఎందుకండి? దీనిని ఏమందాం? ప్రజా సేవ అందామా? వ్యాపారం అందామా?
ఏది ఏమైనా మీరు ఇలా మాట్లాడడం సుతారమూ నచ్చలేదు స్వామిజీ.
తెలంగాణ హిందూ సమాజం మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంది. స్పందించండి.
- తిరుపతి తాండ్ర
(వాట్సప్ సౌజన్యం)