ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ప్రస్తుత ఇంటలిజెన్స్ చీఫ్ గా వ్యవహరిస్తున్న కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డిని కొత్త డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. అయితే రాజేంద్రనాథ్ రెడ్డి పూర్తి అదనపు బాధ్యతలను చేపట్టనుండడం విశేషం.
రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. కరీంనగర్ అదనపు ఎస్పీగా, విశాఖ, విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. విధుల్లో రాజేంద్ర నాథ్ రెడ్డి సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. పోలీస్ శాఖలో ఆయనకు సౌమ్యునిగా పేరుంది.
ఇదిలా ఉండగా బదిలీకి గురైన గౌతమ్ సవాంగ్ కు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా బదిలీ ఉత్తర్వులో స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జూలై వరకు సవాంగ్ కు పదవీ కాలం ఉన్నప్పటికీ, ఆయన ఆకస్మిక బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఫీచర్డ్ ఇమేజ్: ఏపీ కొత్త డీజీపీ రాజేంంద్రనాథ్ రెడ్డి