ప్రముఖ గాయని లతా మంగేష్కర్ (92) ఇక లేరు. ఈ ఉదయం 8.12 గంటలకు లత మరణించినట్లు ముంబయి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. గత నెల 8న కరోనా లక్షణాలతో లత ఆసుపత్రిలో చేరారు. చికిత్సతో మెరుగవుతున్న తరుణంలోనే ఆరోగ్యం విషమించి లతా మంగేష్కర్ తుదిశ్వాస విడిచారు.
ఇండియన్ నైటింగేల్, భారత రత్న సహా పలు అవార్డులను లతా మంగేష్కర్ పొందారు. లతా మంగేష్కర్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు సంతాపం తెలిపారు.
వివిధ భాషల్లో 30 వేల పాటలకు పైగా పాడిన లతా మంగేష్కర్ 170 మంది మ్యూజిక్ డైరెక్టర్ల వద్ద పనిచేయడం విశేషం. తెలుగులోనూ పలు సినిమాల్లో లత పాటలు పాడారు. లతా మంగేష్కర్ తెలుగు సినిమాలకు పాడిన పాటలను దిగువన గల వీడియోల్లో చూసేయండి.