ఖమ్మం జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి ఆనవాళ్లను అటవీ శాఖ అధికారులు కనుగొన్నారు. గడచిన పది రోజులుగా సత్తుపల్లి ఏరియాలో పెద్దపులి సంచరిస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ పులి ఎటువంటి హాని చేస్తుందోనని భయకంపితులవుతున్నారు.
ఈ పరిస్థితుల్లోన పులి ఆనవాళ్ల కోసం అటవీ అధికారులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సత్తుపల్లి అటవీ రేంజ్ పరిధిలోని చంద్రయపాలెం బీట్ వద్ద పులి సంచరించిన దృశ్యం కనిపించింది. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో పెద్దపులి ట్రాప్ కెమెరాలో చిక్కింది.
గత ఆదివారం ఉదయం 8.09 గంటలకు పులి ట్రాప్ కెమెరాలో చిక్కింది. అయితే ఇప్పటి వరకు ఈ పులి ఎవరికీ ఎటువంటి హాని చేయలేదని అటవీ అధికారులు స్పష్టం చేశారు. త్వరలోనే పులి సత్తుపల్లి ప్రాంతం నుంచి వెళ్లిపోతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.