మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే మరణించారా? ఔననే వార్తలు వస్తున్నాయి ఛత్తీస్ గఢ్ రాష్ట్ర మీడియా వర్గాల నుంచి. మాావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే అనారోగ్యంతో మృతి చెందారనేది ఆయా వార్తల సారాంశం.
మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఆర్కే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఛత్తీస్ గఢ్ మీడియా నివేదిస్తోంది. దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో ఆర్కే తుదిశ్వాస విడిచినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్య అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైెస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన చర్చల్లో ఆర్కే కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వంతో చర్చల కోసం బయటకు వచ్చిన నక్సల్ నేతలకు ఆర్కే నాయకత్వం వహించారు. ఛత్తీస్ గఢ్ అడవుల్లో సాకేత్ పేరుతోనూ కార్యకలాపాలు నిర్వహించిన ఆర్కే మృతి అధికారికంగా ధ్రువపడాల్సి ఉంది.