‘దళిత బంధు’ పథకంపై తెలంగాణా సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దళిత బంధు విజయం మీద.. మీ హుజూరాబాద్ యొక్క విజయం మీద.. అంటే దళిత బంధు విజయం మీద.. మొత్తం తెలంగాణా యొక్క దళిత జాతి భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని సీఎం అన్నారు. ఈమేరకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ వాసాల నీరోషా భర్త రామస్వామితో సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. చాలా బాధ్యతతో, ఓపికతో, గొప్ప, స్పష్టమైన అవగాహనతో చేసే పని అని, ఆషామాషీ పనికాదని దళిత బంధు గురించి సీఎం నిర్వచించారు.
దళిత బంధు లక్ష్యాలను, ఇందుకోసం అనుసరిస్తున్న విధానాన్ని, పథకం ఆవశ్యకతను సీఎం వివరించారు. ఇంటలిజెన్స్ నివేదికల ప్రకారం 427 మందిని ఎంపిక చేసి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ పోన్ చేసి ఆహ్వానిస్తారని, ఆదివారం అక్కడ భోజనాలు చేసుకుని దళిత బంధు ప్రోగ్రాం గురించి అవగాహన చేసుకుంటారని చెప్పారు. ఆ తర్వాత ఈనెల 26న నియోజకవర్గానికి చెందిన ఎంపిక చేసిన దళితులు ప్రగతి భవన్ కు రావాలని కేసీఆర్ ఆహ్వానించారు. రామస్వామితో సీఎం ఇంకా ఏం మాట్లాడారో పైన గల ఆడియోలో వినవచ్చు.