ఖమ్మం మున్సిపల్ 57వ డివిజన్ కార్పొరేటర్ రబీదా బేగం భర్త, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ ముస్తఫాకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధైర్యం చెప్పారు. రేవంత్ తోపాటు కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా చంచల్ గూడ జైలులో గల ముస్తఫాకు ధైర్యం చెప్పారు. పీడీ యాక్టు కింద చంచల్ గూడ జైలులో గల ముస్తఫాతో రేవంత్ రెడ్డి వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ, పోలీసులు నమోదు చేసిన కేసుపై లీగల్ ఏం చేయాలో చేస్తామని హామీ ఇచ్చారు.
‘నిన్ను నేను చూసుకుంటాను ముస్తఫా భాయ్… నీకు ప్రాబ్లం ఏమీ లేదు’ అని రేవంత్ ధైర్యాన్ని నూరిపోశారు. ఆ తర్వాత రేణుకా చౌదరి మాట్లాడుతూ ముస్తపాను హీరోగా అభివర్ణించారు. పార్టీ మొత్తం అండగా ఉంటుందని, బే ఫికర్ గా ఉండాలని, నువ్వు హీరోవు కాబట్లే నిన్ను సతాయిస్తున్నారని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. ముస్తఫాతో రేవంత్ రెడ్డి, రేణుకాచౌదరి సంభాషణకు సంబందించిన వీడియోను దిగువన చూడవచ్చు.