మావోయిస్టు పార్టీ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ అలియాస్ యాప నారాయణ మృతి చెందారనే వార్తలపై ఆ పార్టీ క్లారిటీ ఇచ్చింది. హరిభూషణ్ తోపాటు మరో నాయకురాలు భారతక్క అలియాస్ సారక్క కూడా మరణించినట్లు మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఆ పార్టీ తెలంగాణా కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. కరోనా లక్షణాలతోనే వీరిద్దరూ అనారోగ్యానికి గురై మరణించినట్లు పార్టీ వెల్లడించింది.
ఈనెల 21న హరిభూషణ్, 22న పార్టీ ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సారక్క తుదిశ్వాస విడిచారని జగన్ పేర్కొన్నారు. యాప నారాయణ చాలాకాలంగా బ్లాంకైటీస్, అస్తమా వ్యాధులతో బాధపడుతున్నారని కూడా చెప్పారు. ప్రజల మధ్యనే వీరిద్దరి అంత్యక్రియలు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా అటు హరిభూషణ్, ఇటు భారతక్క పార్టీకి చేసిన సేవలను జగన్ కొనియాడారు ఆయన విడుదల చేసిన ప్రకటన తొలిపేజీలోని సారాంశం దిగువన చూడవచ్చు.